కేసీఆర్‌ని తన వివాహానికి ఆహ్వానించిన హీరో నితిన్..

టాలీవుడ్: హీరో నితిన్ త్వరలో ఒక ఇంటివాడు కాబోతున్నాడు. తన ప్రియురాలు షాలినీని ఈ నెల 26న ఫలక్‌నామా ప్యాలస్‌లో వివాహం చేసుకోనున్నాడు. వివాహాల విషయంలో ప్రభుత్వాలు కొన్ని నియమాలు అనుసరించాలని చెప్పిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో నితిన్ షాలినీలా వివాహం కేవలం సన్నిహితుల సమక్షంలో జరగనుంది. టాలీవుడ్ లోని సన్నిహితులతో పాటు కొంతమంది రాజకీయ నాయకులు హాజరయ్యే అవకాశం వుంది. ఈ క్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ని హీరో నితిన్ తన పెళ్లికి ఆహ్వానించాడు.

hero-nithiin-invites-cm-kcr-to-his-wedding

కొంతకాలంగా ప్రేమలో ఉన్న నితిన్, షాలిని ఇరువైపు కుటుంభాల అంగీకారంతో వివాహం చేకుంటున్నారు. ఇప్పటికే వివాహం జరగాల్సి వున్నా లొక్డౌన్ ఆంక్షలు వల్ల వాయిదా పడింది. 2021లో నితిన్ వరుస సినిమాలతో రానున్నాడు. ప్రస్తుతం మూడు సినిమాలు షూటింగ్ దశలో వున్నాయి.

ఇంకా చదవండి: వైరల్ అవుతున్న ఆర్జీవీ పవర్ స్టార్ సినిమా పోస్టర్లు

Comments

Popular posts from this blog

విరసం నేత వరవరరావును నానావతి ఆసుపత్రికి తరలింపు..

జైలులో వరవరరావుకు కరోనా పాజిటివ్‌..!

ఇంటి నుంచి బయటకు వస్తే ఇక మాస్కు తప్పనిసరి..!