ఓటీటీ పైకి తమన్నా "దట్ ఈజ్ మహాలక్ష్మి"?

టాలీవుడ్: హీరోయిన్ తమన్నా ప్రధాన పాత్రలో నటించిన చిత్రం "దట్ ఈజ్ మహాలక్ష్మి" అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలకానుందని సమాచారం. తమన్నా భాటియా నటించిన ఈ చిత్రం 2018 సెప్టెంబర్‌లో థియేటర్‌లో విడుదలకావలసి వుంది. అయితే, కొన్ని ఆర్ధిక సమస్యల కారణంగా ఈ చిత్రం ఆలస్యం అయింది. "దట్ ఈజ్ మహాలక్ష్మి" హిందీ చిత్రం క్వీన్ (2013) యొక్క అధికారిక తెలుగు రీమేక్. అయితే తమన్నా పాత్రను తమిళంలో కాజల్ అగర్వాల్, మలయాళంలో మంజిమా మోహన్ చేశారు.

tamanna-new-movie-on-ott-తమన్నా

తమన్నా ప్రధాన పాత్రలో వస్తున్న "దట్ ఈస్ మహాలక్ష్మి", ఒక అమ్మాయి యొక్క వ్యక్తిగత జీవితానికి అద్దం పట్టేలా ఉంటుంది. ఈ సినిమాలో షిబాని దండేకర్, సిద్దూ జోన్నలగడ్డ, సి.వి.ఎల్. నరసింహారావు, జెఫ్రీ హో తదితరులు ప్రముఖ పాత్రల్లో నటించారు. దట్ ఈస్ మహాలక్ష్మికి ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించారు.

Comments

Popular posts from this blog

విరసం నేత వరవరరావును నానావతి ఆసుపత్రికి తరలింపు..

జైలులో వరవరరావుకు కరోనా పాజిటివ్‌..!

ఇంటి నుంచి బయటకు వస్తే ఇక మాస్కు తప్పనిసరి..!