ఆక్స్ ఫర్డ్ డెవలప్ చేసిన కరోనా వ్యాక్సిన్ రిజల్ట్ వచ్చేసిందోచ్..!

అంతర్జాతీయం: ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయం, అస్ట్రాజెనికా డెవలప్ చేసిన వ్యాక్సిన్ ఫలితం ఎట్టకేలకు వచ్చింది. ఈ వ్యాక్సిన్ పేరును 'ChAdOxI'గా నుంచి  AZD1222గా మార్చారు. అయితే ఇప్పటి వరకు రెండు దశల్లో నిర్వహించిన ట్రయల్స్ కు సంబంధించిన ఫలితాలు ఎలా ఉన్నాయన్న విషయాన్ని ప్రఖ్యాత మెడికల్ జర్నల్ లాన్సెట్ వెల్లడించింది. వ్యాక్సిన్ బాగా పనిచేస్తుందని, వ్యాక్సిన్ ఇచ్చిన వారంతా క్షేమంగా ఉన్నట్లు పేర్కొన్నారు. అలాగే డెవలప్ చేసిన ChAdOx1 nCoV-19/ AZD1222 వ్యాక్సిన్ తో రోగి యొక్క రోగనిరోధక శక్తి పెరిగినట్లుగా శాస్త్రవేత్తలు వెల్లడించారు.

oxford-astrazeneca-covid-19-vaccine-trails-results-success

హ్యుమన్ ట్రయల్స్ లో 1077 మంది పాల్గొన్నారు. అందరిలోనూ యాంటీబాడీలు, టి కణాలు విడుదలైనట్లు వారు గుర్తించారు. వ్యాక్సిన్ తీసుకున్న పద్నాలుగు రోజులకు టి కణాలు, 28 రోజులకు యాంటీబాడీలు తీవ్ర దశకు చేరుకున్నాయని తెలిపారు. మరిన్ని మంచి ఫలితాలు చూసేందుకు త్వరలో బ్రిటన్ లో పదివేల మందికి, అమెరికాలో 30 వేల మందికి, దక్షిణాఫ్రికాలో 2వేల మంది అలాగే బ్రెజిల్ లో 5వేల మందిపై ప్రయోగాలు చేయనున్నారు. వ్యాక్సిన్ ప్రయోగం విజయవంతమైతే, ఈ ఏడాది చివరకు వ్యాక్సిన్ ప్రపంచానికి అందుబాటులో వచ్చే అవకాశం వుంది.

Comments

Popular posts from this blog

విరసం నేత వరవరరావును నానావతి ఆసుపత్రికి తరలింపు..

జైలులో వరవరరావుకు కరోనా పాజిటివ్‌..!

ఇంటి నుంచి బయటకు వస్తే ఇక మాస్కు తప్పనిసరి..!