పెన్షన్‌ని అందుకుంటున్న మహిళలకు కూడా ‘వైఎస్సార్ చేయూత’

ఆంధ్రప్రదేశ్: సంక్షేమ పథకాల అమలులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎటువంటి వెనుకడుగు వేయకుండా ముందుకు వెళుతుందనే చెప్పాలి. పైగా అర్హులు వారి అర్హతల విషయంలో బాగా సానుకూలంగా ఆలోచిస్తుంది. అందరూ లభ్ధి పొందేలా నిర్ణయాలు తీసుకొంటుందన్న విషయంలో ఏ మాత్రం సందేహం లేదు. ‘వైఎస్సార్ చేయూత’ పథకం మొదలు పెట్టిన ప్రభుత్వం మొదట్లో దీనికి పెన్షన్ తీసుకునేవారు అనర్హులు అని ప్రకటించింది. అయితే జగన్‌ తాజా నిర్ణయం ప్రకారం పెంషన్ తీసుకునే వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులైన మహిళలు, చేనేతలు, గీత, మత్య్సకార మహిళలకు కూడా ఈ పథకం ద్వారా ఆర్థిక ప్రయోజనం పొందనున్నారు. ఈ మేరకు బుధవారం జరిగిన మంత్రి వర్గ సమావేశంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి తన నిర్ణయాన్ని తెలిపారు. ఈ నిర్ణయం వలన దాదాపుగా 8.21 లక్షల మందికి పైగా మహిళలకు లబ్ది చేకూరనుంది.

ysr-cheyutha-also-for-women-receiving-pension

ప్రస్తుతం తీసుకున్న తాజా నిర్ణయం ద్వారా బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీ వర్గాలకు చెందిన 45 ఏళ్ల నుంచి 60 ఏళ్లలోపు ఉన్న మహిళలందరికీ ఏటా రూ.18,750 చొప్పున నాలుగేళ్లలో రూ.75 వేలు అందించనున్నారు. ఆగస్టు 12వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు.

దీనికి సంబంధించిన ఆదేశాలు ప్రభుత్వం ఇప్పటికే జారీ చేసింది. కాగా ఈ పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏడాదికి రూ.1,540 కోట్లకు పైగా, నాలుగేళ్లలో రూ.6,163 కోట్ల మేర అదనంగా ఖర్చు చేయనుంది.

ఇంకా చదవండి:

ఏపీలో ఇక 25 జిల్లాలు 3 రాజధానులు.. !!

Comments

Popular posts from this blog

విరసం నేత వరవరరావును నానావతి ఆసుపత్రికి తరలింపు..

జైలులో వరవరరావుకు కరోనా పాజిటివ్‌..!

ఇంటి నుంచి బయటకు వస్తే ఇక మాస్కు తప్పనిసరి..!