ఒడిశా‌లో కనిపించిన అరుదైన పసుపు పచ్చ తాబేలు: వైరల్ వీడియో

ఒడిశా: ఎప్పుడూ చూడని అరుదైన జంతువులూ, వన్య ప్రాణులు జనాలను కనువిందుచేస్తాయి. కానీ వాటి సంరక్షణ ఎంతో ముఖ్యం. అవి జనారణ్యంలోకి వచ్చినప్పుడు వాటిని కొంతమంది పట్టించుకోరు అలాగే వాటి సంరక్షణ తెలియక పరోక్షంగా వాటి చావుకు కారణమౌతారు. అయితే వాటి సంరక్షణకు అటవీ శాఖ ఎప్పుడూ సిద్దంగానే ఉంటుంది. అలాంటి అరుదైన వన్య ప్రాణులు కనిపించినప్పుడు అటవీ శాఖ సిబ్బందికి తెలియచేయటం ఎంతో ముఖ్యం.

rare-yellow-turtle-found-in-odisha

ఇక విషయానికొస్తే ఒడిశాలో ఒక అరుదైన పసుపు పచ్చ తాబేలు జనాలకు కనువిందు చేసింది. అది జనారణ్యంలోకి రావడంతో బాలసోర్ జిల్లాలోని సోరో బ్లాక్‌లోని సుజాన్‌పూర్ గ్రామానికి చెందిన స్థానికులు దానిని అటవీ శాఖ అధికారులకు అప్పగించారు. అయితే అటవీశాఖ సిబ్బంది ఒకరు మాట్లాడుతూ, ఇదొక అరుదైన జాతి తాబేలని, ఇంతకుముందు ఇటువంటిది ఇక్కడ చూడలేదని తెలియచేశారు. అటవీ శాఖ ప్రకారం, ఈ తాబేలు 30 కిలోల కంటే ఎక్కువ బరువు కలిగి ఉంది, అలాగే దాని గరిష్ట జీవితం 50 సంవత్సరాలు. ఈ విధంగా అక్కడి స్థానికులు బాధ్యతగా వ్యవహరించి ఆ తాబేలును అటవీశాఖకు అప్పచెప్పారు. మీకు కూడా ఇలాంటి అరుదైన జంతువులు లేదా వన్య ప్రాణులు కనిపిస్తే అటవీ శేఖకు తెలియజేయండి.ఇంకా చూడండి:

రోడ్డుపై నిద్రించిన ఖడ్గమృగం: వైరల్ వీడియో

మనిషి ముఖాన్ని తలపిస్తున్న మలేషియా చేప: ఫోటోలు వైరల్

Comments

Popular posts from this blog

విరసం నేత వరవరరావును నానావతి ఆసుపత్రికి తరలింపు..

జైలులో వరవరరావుకు కరోనా పాజిటివ్‌..!

ఇంటి నుంచి బయటకు వస్తే ఇక మాస్కు తప్పనిసరి..!