ఏకంగా నకిలీ ఎస్‌బిఐ బ్యాంకునే తెరిచారు..అవాక్కయిన పోలీసులు..

నకిలీ ఎస్‌బిఐ బ్యాంకు (తమిళనాడు): దేశంలోనే అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్‌బిఐ. ఏకంగా ఈ బ్యాంకుకే నకిలీ బ్రాంచ్ ఓపెన్ చేశారు కేటుగాళ్లు. వివరాల్లోకి వెళితే తమిళనాడులోని కడలూరులోని పనృతిలో ముగ్గురు వ్యక్తులు కలిసి జనాలను మోసం చేయటానికి పెద్ద పథకమే పన్నేరు. ఏకంగా నకిలీ స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా బ్రాంచును మొదలుపెట్టారు. ఎవరికీ అనుమానం రాకుండా కస్టమర్లకు అవసరమయిన నకిలీ చలానాలు, పాస్ పుస్తకాలు, స్టాంపులు అన్నీ ముందుగా సేకరించి వాటిని కస్టమర్లకు అందుబాటులో ఉంచారు.

fake-sbi-branch-busted-in-tamil-nadu

ఇలా ఏకంగా మూడు నెలలు పాటు నకిలీ బ్యాంకును అదే ప్రాంతంలో నడిపిన ఆ కేటుగాళ్లను ఒక ఎస్‌బిఐ కస్టమర్ పట్టించడం గమనార్హం. అనుమానం వచ్చిన ఆ ప్రాంత ఎస్‌బిఐ కస్టమర్ ఒకరు తన హోమ్ బ్రాంచ్ మేనేజరును ఆరా తీసాడు. ఆ బ్రాంచ్ మేనేజర్ జోనల్ ఆఫీసును సంప్రదించగా అటువంటిదేమీ లేదని తేల్చి చెప్పింది. పనృతి ప్రాంతంలో రెండు బ్యాంకులు మాత్రమే ఉన్నాయని మూడో బ్యాంకు లేదని చెప్పడంతో, విచారించడానికి అక్కడికెళ్లిన అసలైన ఎస్‌బిఐ సిబ్బంది కంగు తిన్నారు. అసలైన బ్యాంకు ఎలా వుంటుందో అచ్చం అలాగే ఆ బ్యాంకు ఉండటం చూసి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసారు.

ఈ కథలో మరో పెద్ద మలుపు ఏంటంటే, నకిలీ బ్యాంకు ఐడియా వచ్చిన వ్యక్తి, కమల్ బాబు తల్లి తండ్రులు ఇద్దరూ స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా మాజీ ఉద్యోగులే. అయితే అతని తండ్రి 10 సంవత్సరాల ముందు చనిపోగా తల్లి 2 సంవత్సరాల క్రితం బ్యాంకు నుంచి రిటైర్మెంట్ తీసుకుంది. నిరుద్యోగం కారణంగా ఈ పని చేసినట్టు కమల్ బాబు ఒప్పుకోవటం జరిగింది.

చైనా నిషేధిత యాప్‌ కంపెనీలకు భారత్ 79 సూటి ప్రశ్నలు

Comments

Popular posts from this blog

విరసం నేత వరవరరావును నానావతి ఆసుపత్రికి తరలింపు..

జైలులో వరవరరావుకు కరోనా పాజిటివ్‌..!

ఇంటి నుంచి బయటకు వస్తే ఇక మాస్కు తప్పనిసరి..!