ఇండియా దెబ్బకు చైనా నుంచి మకామ్ మార్చనున్న టిక్ టాక్!

చైనా నుంచి మకామ్ మార్చనున్న టిక్ టాక్: చైనా కంపెనీల యాప్స్ ను ఇండియా బ్యాన్ చేసిన సంగతి తెలిసిందే. అందులో చాలా కంపెనీలు ఈ బ్యాన్ వల్ల తమ బిజినెస్ కు భారీ నష్టం కలిగిందని భావిస్తున్నాయి. భారీగా వ్యాపార లావాదేవీలు కోల్పోయిన కొన్ని కంపెనీలు ముందుకు వచ్చి దయచేసి బ్యాన్ ను ఎత్రివేయాలని భారత్ ప్రభుత్వాన్నిఅభ్యర్దిస్తున్నాయి. అందులో ట్రూ కాలర్, టిక్ టాక్ వంటి యాప్ దిగ్గజాలు వున్నాయి. దీనిని పరిశీలిస్తున్న భారత ప్రభుత్వం చైనా నిషేదిత యాప్ కంపెనీలకు 79 ప్రశ్నలతో కూడిన నోటీసులు పంపింది. గడువులోపు సమాధానాలు ఇచ్చే కంపెనీలకు తిరిగి వ్యాపారం చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే ఆ సమాధానాలు ఇండియన్‌ ఇంటెలిజన్స్‌ ఏజన్సీలు, గ్లోబల్‌ సైబర్‌ వాచ్‌ డాగ్‌లు యొక్క భద్రతా రిపోర్టులతో సరితూగాలి.

tiktok-to-move-headquarters-from-china

ఇదిలా ఉంటే, మరో వైపు భారీగా బిజినెస్ కోల్పోయిన కొన్ని చైనీస్ కంపెనీలు తమ యాప్స్ యొక్క ముఖ్య కార్యాలయాలను ఇతర దేశాలకు మార్చే ప్రయత్నాలు చేస్తున్నాయి. వాటిలో కొన్ని కంపెనీలు దక్షిణ కొరియాకు మకాం మారుస్తుంటే మరికొన్ని సింగపూర్, అమెరికా దేశాల వైపు చూస్తున్నాయి. చైనా నుంచి మకాం మార్చే కంపెనీలలో టిక్ టాక్ పేరు ముందుగా వినిపిస్తోంది. భారత్ బ్యాన్ వల్ల టిక్ టాక్ కు ఊహించని షాక్ తగిలిందని చెప్పాలి.

టిక్ టాక్ వీడియో యాప్‌ను భారత్ నిషేధించడం వల్ల రోజుకు 3.5 కోట్ల రూపాయల వరకు "ఆర్థిక నష్టాలు" జరుగుతున్నాయని, 250 మందికి పైగా ఉద్యోగాలు ప్రమాదంలో పడ్డాయని టిక్‌టాక్ పేరెంట్ కంపెనీ బైట్‌డాన్స్ తెలిపింది. పైగా రోజుకు దాదాపు ఒక మిలియన్ కొత్త వినియోగదారులను కోల్పోతున్నట్లు ఆ కంపెనీ ప్రకటించింది. దీన్నిబట్టి టిక్ టాక్ మన దేశంలో ఎంతగా పాతుకు పోయిందో తెలుస్తుంది.

ప్రస్తుత పరిస్థితుల్లో భారత ప్రభుత్వం ఈ బ్యాన్ ను కొనసాగించేలా కనబడుతుంది. అందుకే భారత్ మీద ఆధారపడి వ్యాపారం సాగిస్తున్న కొన్ని కంపెనీలు ఎలాగైనా చైనా నుంచి తమ ప్రధాన కార్యాలయాలను మార్చాలని యోచిస్తున్నాయి. మరోవైపు టిక్ టాక్ ప్రియులు మాత్రం ఈ బ్యాన్ ను తప్పించుకుని టిక్ టాక్ ఇండియాకు తిరిగి వస్తుందని ఆశిస్తున్నారు.

Comments

Popular posts from this blog

విరసం నేత వరవరరావును నానావతి ఆసుపత్రికి తరలింపు..

జైలులో వరవరరావుకు కరోనా పాజిటివ్‌..!

ఇంటి నుంచి బయటకు వస్తే ఇక మాస్కు తప్పనిసరి..!