పాన్ ఇండియా సినిమాలో ఆది సాయికుమార్!

టాలీవుడ్: ప్రేమ కావాలి, లవ్లీ సినిమాలతో విజయాలు అందుకున్న టాలీవుడ్ హీరో ఆది సాయికుమార్ ఆ తరువాత పెద్దగా విజయాలు  అందుకోలేకపోయారు. అయితే శమంతకమణి అనే సినిమాలో ఆది కామెడీ టైమింగ్ కి మంచి మార్కులు పడ్డాయి. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ అయింది. కానీ అది మల్టీస్టారర్ సినిమా. అయితే ఆది మాత్రం విరామం లేకుండా మంచి బ్రేక్ కోసం చాలా రోజులు నుంచి ప్రయత్నిస్తున్నాడు.

aadi-saikumar-next-in-a-pan-india-film

2019 లో అతను హీరోగా భారీ అంచనాలతో విడుదలైన “జోడి”, “ఆపరేషన్ గోల్డ్ ఫిష్”, ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద విఫలమయ్యాయి. అయితే తాజా వార్తల ప్రకారం అతను పాన్ ఇండియా సినిమా ఒకటి కమిట్ అయ్యాడని తెలుస్తుంది. వివరాల్లోకి వెళితే ఎస్విఆర్ ప్రొడక్షన్స్ పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ కోసం ఆది సాయికుమార్ ను ప్రధాన పాత్ర కోసం తీసుకున్నారు.

దర్శకుడు బల్వీర్ ఎస్ ఈ ప్రాజెక్టుకు దర్శకత్వం వహించనున్నారు, ఇది అతనికి తొలి సినిమా. ఇది ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ అని, ఆది ఇందులో పోలీసు పాత్ర పోషిస్తున్నాడని తెలుస్తుంది. అయితే ఈ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేయడానికి ప్రణాళిక చేస్తున్నారు. ఈ చిత్రం ఆది సాయికుమార్ సినిమా కెరీర్‌లో మంచి బ్రేక్ ఇస్తుందని సినిమా బృందం తెలిపింది.

ప‌వ‌ర్ స్టార్ మూవీ: ఎన్నిక‌ల త‌ర్వాత జరిగిన క‌థ అంటున్న ఆర్జీవీ

Comments

Popular posts from this blog

విరసం నేత వరవరరావును నానావతి ఆసుపత్రికి తరలింపు..

జైలులో వరవరరావుకు కరోనా పాజిటివ్‌..!

ఇంటి నుంచి బయటకు వస్తే ఇక మాస్కు తప్పనిసరి..!