శ్రీ పద్మనాభ స్వామి ఆలయ నిర్వాహణ ట్రావెన్కోర్ రాజకుటుంబీకులకు అప్పగింత!

ఢిల్లీ: ప్రపంచంలోనే అత్యంత సంపద కలిగిన ఏకైక ఆలయం, కేరళలోని శ్రీ పద్మనాభ స్వామి ఆలయం నిర్వహణ బాధ్యతలపై ఎట్టకేలకు సుప్రీంకోర్టు సోమవారం తీర్పునిచ్చింది. కేరళలోని తిరువనంతపురంలోని శ్రీ పద్మనాభస్వామి ఆలయం పరిపాలన మరియు నిర్వహణలో ట్రావెన్కోర్ యొక్క పూర్వపు రాజకుటుంబీకులకు హక్కులను ఇస్తూ వారిని సమర్థించింది.

supreme-court-confirms-the-rights-of-the-royal-family-of-travancore-to-manage-sree-anantha-padmanabha-swamy-temple

1991 లో ట్రావెన్కోర్ చివరి పాలకుడు మరణించిన తరువాత రాజకుటుంబ హక్కులు నిలిచిపోయాయన్న కేరళ హైకోర్టు 2011 ఉత్తర్వులను ఎస్సీ తిప్పికొట్టింది, చివరి పాలకుడి మరణం వల్ల కుటుంబ హక్కులను రద్దు చేయలేమని సుప్రీమ్ కోర్ట్ పేర్కొంది.

చివరి పాలకుడు మరణించినంత మాత్రాన హక్కులను ప్రభావితం చేయదని మరియు వారు ఆచారం ప్రకారం మనుగడ సాగిస్తారని ఉన్నత న్యాయస్థానం తెలిపింది. కొత్త కమిటీ ఏర్పడే వరకు ఆలయ వ్యవహారాలను నిర్వహించడానికి జిల్లా న్యాయమూర్తి తిరువనంతపురం నేతృత్వంలోని తాత్కాలిక కమిటీ నిర్వహిస్తోందని పేర్కొంది.

ఇప్పుడు మనం చూస్తున్న శ్రీ పద్మనాభస్వామి ఆలయాన్ని 18 వ శతాబ్దంలో ట్రావెన్కోర్ రాయల్ హౌస్ కు చెందిన రాజులు పునర్నిర్మించటం జరిగింది . ఆతరువాత వారు దక్షిణ కేరళను, తమిళనాడులోని కొన్ని ప్రాంతాలను 1947 వరకు పరిపాలించింది.

సుప్రీమ్ కోర్టు తీర్పుపై రాజకుటింబీకులు ఆనందం వ్యక్తం చేశారు. కాగా ఈ ఆలయం యొక్క సంపద లక్షకోట్లకు పైగా ఉంటుందని అంచనా.

హరివారసనం తెలుగు సాహిత్యం | ఏసుదాస్, కుంబకుడి కులాతుర్ అయ్యర్

Comments

Popular posts from this blog

విరసం నేత వరవరరావును నానావతి ఆసుపత్రికి తరలింపు..

జైలులో వరవరరావుకు కరోనా పాజిటివ్‌..!

ఇంటి నుంచి బయటకు వస్తే ఇక మాస్కు తప్పనిసరి..!