కరోనా వ్యాప్తిలో మన దేశం ఏ దశలో వుంది?

కరోనా వ్యాప్తిలో మన దేశం ఏ దశలో వుంది?: దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 7.6 లక్షలకు చేరింది, రోజుకి 25 వేళ పాజిటివ్ కేసులు వస్తున్నా మన దేశం ఇంకా మూడవ దశకు రాలేదని కేంద్ర ప్రభుత్వం తేల్చేసింది. కేవలం లోకల్ ఔట్ బ్రేక్స్ (స్థానిక వ్యాప్తి) మాత్రమే ఉన్నట్టు వెల్లడించింది. దీనికి కారణం లేక పోలేదు. మన దేశంలో కరోనా భారీన పడిన వారి యొక్క రికవరీ రేటు అధికంగా వుంది. ప్రస్తుతం చూస్తే రీకవరీ రేటు 62 శాతం ఉందని కేంద్ర మంత్రి హర్షవర్ధన్ తెలిపారు. అసలు ఈ మహమ్మారి యొక్క మూడు దశలు ఎలా వుంటాయో చూద్దాం.

india-corona-transmission-stage

మొదటి దశ: ఈ దశలో, ఈ వ్యాధి స్థానికంగా వ్యాపించదు. ఈ దశలోని కేసులను కరోనా ప్రభావితమైన దేశానికి ప్రయాణించిన వ్యక్తులలో మాత్రమే చూడగలం.

రెండవ దశ: ఇది స్థానిక వ్యాప్తి యొక్క దశ - దేశంలోకి వైరస్ తీసుకువచ్చిన వ్యక్తులు వారు పరిచయం ఉన్న వ్యక్తులకు, స్నేహితులు మరియు కుటుంబ సభ్యులకు వ్యాప్తి చేయటం. ఈ దశలో వైరస్ భారీన పాడిని వ్యక్తులను గుర్తించడం సులభం.

మూడవ దశ: మూడవ దశలో వైరస్ వ్యాప్తి యొక్క సంక్రమణ మూలం గుర్తించలేనిది; ఈ దశ వైరస్ బారిన పడిన వారు ప్రయాణ చరిత్ర లేని వ్యక్తులు - ఇది అంటువ్యాధిలా మారుతుంది మరియు నియంత్రించడం కష్టం.

చివరి దశ: ఈ దశలో దేశవ్యాప్తంగా సంక్రమణ యొక్క అనేక పెద్ద సమూహాలు ఏర్పడతాయి. అలాగే వ్యాప్తిని అడ్డుకోవటం అసాధ్యం. ఇప్పటివరకు, 4 వ దశను అనుభవించిన ఏకైక దేశం చైనా మాత్రమే.

ప్రభువత్వ వాదన ప్రకారం మన దేశం ఇంకా మూడవ దశకు రాలేదు. అయితే కొంతమంది నిపుణులు మాత్రం మన దేశం మూడవ దశకు చేరుకుందని చెప్తున్నారు. కరోనా కేసులు అత్యధికంగా ఉన్న అయిదు దేశాలతో పోలిస్తే మన దేశంలో ఈ కేసులు సంఖ్య తక్కువగా ఉందని కేంద్రం పేర్కొంది. దేశంలో సామాజిక వ్యాప్తి దశ (మూడవ దశ) చేరుకోవచ్ఛునన్న ఊహాగానాలను ప్రభుత్వం ఖండించింది. దీనిని బట్టి మనం రెండవ దశలో ఉన్నామని అర్ధమవుతుంది.

కానీ ఇలాగే రోజుకు 25 వేల కేసులు వచ్చాయంటే రానున్న రోజుల్లో కరోనాని భారత దేశంలో ఆపటం కష్టమౌతుంది. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్రం సూచిస్తోంది.

Comments

Popular posts from this blog

విరసం నేత వరవరరావును నానావతి ఆసుపత్రికి తరలింపు..

జైలులో వరవరరావుకు కరోనా పాజిటివ్‌..!

ఇంటి నుంచి బయటకు వస్తే ఇక మాస్కు తప్పనిసరి..!