అసలైన అయోధ్య నేపాల్ లో వుంది, శ్రీరాముడు మావాడు: కేపీ శర్మ ఓలీ

జాతీయం: నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ మరోసారి భరత్ పై తన అక్కసు చూపించారు, తాజాగా మరో సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. అసలైన అయోధ్యా నగరం నేపాల్ లో ఉందని, శ్రీరాముడు ఇక్కడి నేపాల్ లోని అయోధ్యలో జన్మించాడని ,భారత్ సాంస్కృతిక దోపిడీ చేస్తుందని విమర్శించారు. కేపీ శర్మ ఓలీ తన నివాసంలో జరిగిన కవి భానుభక్త్ జన్మదిన వేడుకల సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు.

lod-rama-belongs-to-nepali-kp-sharma-oli

ఈ వేడుకలలో ఓలీ మాట్లాడుతూ “అసలు అయోధ్య నేపాల్ బీర్‌గంజ్ జిల్లా థొరీ తీరంలో ఉందని చెప్పుకొచ్చారు. శ్రీరాముడు అక్కడే జన్మించాడు” అని కేపీ శర్మ ఓలీ అన్నారు. అయితే ఈ వ్యాఖ్యలను సదరు నేపాల్ రాష్ట్రీయ ప్రజాతంత్ర పార్టీ నేత కమల్ థాపా ఖండించారు. కమల్ థాపా, ట్విట్టర్ వేదికగా, " ఓలీ ఇలాంటి నిరాధార వ్యాఖ్యలు చేయడం తగదు. చూస్తుంటే, ఉద్రిక్తతలు తగ్గించడానికి బదులు, ఆయన భారత్-నేపాల్ సంబంధాలను చెడగొట్టాలని సంకల్పించుకున్నట్లున్నారు" అన్నారు. అదేవిదంగా వివిధ నాయకులు, ప్రజలు సోషల్ మీడియాలో నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ పై సైటైర్లు వేస్తున్నారు. వైరల్ అవుతున్న ఆర్జీవీ పవర్ స్టార్ సినిమా పోస్టర్లు

Comments

Popular posts from this blog

విరసం నేత వరవరరావును నానావతి ఆసుపత్రికి తరలింపు..

జైలులో వరవరరావుకు కరోనా పాజిటివ్‌..!

ఇంటి నుంచి బయటకు వస్తే ఇక మాస్కు తప్పనిసరి..!