రోడ్డుపై నిద్రించిన ఖడ్గమృగం: వైరల్ వీడియో

అస్సాం (వైరల్ వీడియో): అస్సాంలో వరదలు కారణంగా అక్కడి ప్రజలతో పాటు వన్య ప్రాణులు కూడా ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. ప్రజలను ఆదుకోటానికి ప్రభుత్వాలుంటే అక్కడి జంతువులు మాత్రం ఏ దిక్కులేక కొత్త ప్రాంతాలకు తరలివస్తున్నాయి. ఇలా అలసిపోయి వచ్చిన ఒక ఖడ్గమృగం జాతీయ రహదారి 37 కు దగ్గర్లో వున్న రోడ్డుపై సేదతీరుతూ జనాల కంట పడింది. ఇంకేం, జనాలందరూ తమ స్మార్ట్ ఫోనులు తీసి ఖడ్గమృగం పడుకున్న వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేశారు. అయితే అక్కడి అధికారులు మాత్రం దాని నిద్రకి ఎటువంటి భంగం కలిగించకుండా, అలాగే అది జనాల పైకి రాకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఖడ్గమృగాన్ని తిరిగి సురక్షితమైన ప్రాంతానికి పంపించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, వాహనదారులు నెమ్మదిగా వెళ్లాలని అస్సాం అధికారులు అక్కడివారికి సూచించారు.

ఈ ఖడ్గమృగం వీడియోను కాజీరంగ నేషనల్ పార్క్ మరియు టైగర్ రిజర్వ్ అధికారులు తమ ట్విట్టర్‌లో అప్‌లోడ్ చేశారు. ఖడ్గమృగం రహదారిపై ప్రశాంతంగా నిద్రపోతున్నట్లు ఈ వీడియో చూసిన కొంతమంది జంతు ప్రేమికులు మురిసిపోతుంటే మరికొంతమంది దానికెన్ని భాదలొచ్చాయో అని వాపోతున్నారు.

Comments

Popular posts from this blog

ఎన్-95 మాస్కులు వద్దు.. సాధారణ మాస్కులు వాడండి..!

టిక్‌టాక్ రికార్డును బద్దలు కొట్టిన జూమ్ యాప్..!

రాణీని దత్తతు తీసుకున్న ఉపాసన రాంచరణ్..!