సుప్రియ సామాజిక సేవకు జోయ్ అలుకాస్ బహుమతిగా ఇల్లు!

కేరళ: కొన్ని రోజుల క్రితం సోషల్ మీడియా వేదికగా వైరల్ అయిన ఒక వీడియోలో సుప్రియ అనే ఓ కేరళ యువతి ఒక అంధుడుకి సహాయం చేయడం చూసాం. అయితే సుప్రియ మరోసారి వార్తల్లో నిలిచింది. ఆమె పని చేస్తున్న జోయ్ అలుకాస్ కంపెనీవారు ఒక సొంత ఇల్లును బహుమతిగా ఇవ్వడం విశేషం.

joyalukkas-gift-home-for-supriya-social-service

సుప్రియ ఒక అంధుడుకి సహాయం చేస్తున్న సమయంలో ఎవరో తెలియని వ్యక్తి వీడియోను చిత్రీకరించాడు. ఆ వీడియోను కేరళలోని తిరుపత్తూరు జిల్లా ఐపీఎస్ అధికారి విజయ్ కుమార్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా షేర్ చేశారు. ఆ వీడియో కాస్తా నెట్టింట్లో వైరల్ అయింది. ఆమె అంధుడిపట్ల చూపిన దయకు అందరూ ప్రశంసించారు.

అయితే కేరళలోని తిరుపత్తూర్ జిల్లాలోని తిరువల్లుకు చెందిన సుప్రియ జోయ్ అలుకాస్ సంస్థలో ఒక సాధారణ ఉద్యోగం చేస్తుంది. సుప్రియ చాటుకున్న సామాజిక సేవా దృక్పధాన్ని ఫిదా అయినా జోయ్ అలుకాస్ గ్రూప్ ఛైర్మన్ ప్రత్యేక్షంగా వారి ఇంటికి వెళ్లడం జరిగింది. ఆమె ఉంటున్న ఇరుకు ఇల్లును గమనించిన జోయ్ అలుకాస్ చైర్మన్ సుప్రియను ఆశ్చర్యపరిచేలా ఒక కొత్త ఇల్లును బహుమతిగా ఇచ్చారు. నిస్వార్ధంగా సేవ చేసే వారికి ఏదోరకంగా మంచి జరుగుతుందనే దానికి ఇదో ఉదాహరణ.

ఇంకా చదవండి: శ్రీ పద్మనాభ స్వామి ఆలయ నిర్వాహణ ట్రావెన్కోర్ రాజకుటుంబీకులకు అప్పగింత!

Comments

Popular posts from this blog

విరసం నేత వరవరరావును నానావతి ఆసుపత్రికి తరలింపు..

జైలులో వరవరరావుకు కరోనా పాజిటివ్‌..!

ఇంటి నుంచి బయటకు వస్తే ఇక మాస్కు తప్పనిసరి..!