కరోనా వైరస్ వ్యాక్సిన్ పరిశోధనలు రష్యా హ్యాక్ చేస్తోంది: బ్రిటన్

అంతర్జాతీయం: ప్రస్తుతం ప్రపంచంలోని దేశాలన్నీ కొరోనాకు వ్యాక్సిన్ కనిపెట్టే పనిమీదుంటే రష్యా మాత్రం మా కరోనా వైరస్ వ్యాక్సిన్ పరిశోధనలను హ్యాకింగ్ చేస్తోందని తీవ్ర ఆరోపణలు చేసింది బ్రిటన్. ఈ ఆరోపణలతో కెనడా, యుఎస్ కూడా ఏకీభవించాయి. కొంతమంది రష్యాకు చెందిన గూఢచారులు తమయొక్క కరోనా వైరస్ వ్యాక్సిన్ పరిశోధనలకు సంభందించిన డేటాను తస్కరించేందుకు కుట్ర చేశారని బ్రిటిష్ ఇంటలిజెన్స్ చెప్తోంది. కాజీ బేర్, డ్యూక్స్ పేర్లతో కొంతమంది మా డేటా మీద నిఘా ఉంచారు. అయితే మేము మా డేటాను రక్షించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని బ్రిటిష్ ఇంటెలిజెన్స్ మీడియాకు తెలిపింది.

russian-spies-hacking-corona-virus-vaccine-researches-says-britain-us-canada

యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ కింగ్‌డమ్ మరియు కెనడాలోని ఇంటెలిజెన్స్ ఏజెన్సీల ప్రకారం, కాజీ బేర్, డ్యూక్స్ అని పిలువబడే హ్యాకింగ్ గ్రూప్ కోవిడ్-19 వ్యాక్సిన్ అభివృద్ధిలో పాల్గొన్న విద్యా మరియు ఔషధ పరిశోధన సంస్థలపై సైబర్ దాడి చేస్తోందని చెప్పారు. అయితే ఇదే హ్యాకింగ్ గ్రూప్ 2016 యుఎస్ అధ్యక్ష ఎన్నికల సమయంలో డెమొక్రాటిక్స్ యొక్క ఇమెయిల్ ఖాతాలను హ్యాకింగ్‌ చేసిందని తెలిపాయి.

అయితే రష్యా మాత్రం ఈ దేశాల వాదనలను ఖండించింది. వ్యాక్సిన్ అభివృద్ధిలో రష్యా చివరి దశకు వచ్చిందని తెలిపింది.

Comments

Popular posts from this blog

విరసం నేత వరవరరావును నానావతి ఆసుపత్రికి తరలింపు..

జైలులో వరవరరావుకు కరోనా పాజిటివ్‌..!

ఇంటి నుంచి బయటకు వస్తే ఇక మాస్కు తప్పనిసరి..!