ఆంధ్రాలో ఇప్పుడు వివాహాలకు అనుమతులు సులభం..!

ఆంధ్రప్రదేశ్: కరోనా మహమ్మారి తో ఇప్పుడు వివాహాలకు కూడా అనుమతులు తీసుకోవాలిసిన పరిస్థితి, ఈ సమయంలో వివాహాలు చేసుకోవాలంటే అనుమతులు తప్పనిసరి చేసింది మన దేశ ప్రభుత్వం, సాధ్యమైనంత వరకు పెళ్ళిళ్ళను వాయిదా వేసుకోమని చెప్పింది. Telugu Movies Adda అయితే ప్రభుత్వ ఆదేశాలకు విరుద్దంగా చేసుకున్నవారు మీద అధికారులు కేసులు కూడా పెట్టడం జరిగింది. ఇలా అనుమతులు లేకుండా జరిగిన పెళ్లిళ్లకు వెళ్లిన వారికి కరోనా వ్యాధి సోకిందనే వార్తలు చాలానే వచ్చాయి. మొన్నటికి మొన్న బీహార్ లోని ఒక పెళ్ళికి హాజరైన 100 మందికి కరోనా సోకింది. ఎలాంటి ఘటనలు ఆంధ్రప్రదేశ్ లో కూడా వెలుగుచూశాయి. అయితే అనుమతులు తీసుకుని, కరోనా నియమాలను అనుసరిస్తూ పెళ్లిళ్లు చేసుకోవడం మంచిదని అధికారులు సూచిస్తున్నారు.

permissions-for-marriages-are-now-easy-in-andhra

ఈ వివాహాల విషయలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అనుమతులను కొంచం సులభం చేసిందనే చెప్పాలి. ఇప్పటి వరకు పెళ్లి జరగాలంటే జిల్లా కలెక్టర్ నుంచి అనుమతి తప్పనిసరి. అయితే ఈ ప్రక్రియ ఆలస్యం అవుతుండటంతో, ఏపీ ప్రభుత్వం ఈ బాధ్యతలను మండల పరిధిలో స్థానిక తహసీల్దార్లకు అప్పగించింది. వివాహం చేసుకుంటున్న వధువరులు తరుపున హాజరయ్యే 20 మంది వివరాలు, పెళ్లి పత్రిక, ఆధార్ కార్డు, కరోనా రిపోర్టులతో పాటు 10 నాన్ జ్యుడీషియల్ స్టాంప్ పై అఫిడవిట్ సమర్పిస్తే వివాహం జరుపోకోటానికి అనుమతిస్తారు. ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా టెస్టు చేయించుకోవాలా.. ఐతే వెంటనే ఈ పని చేయండి!

Comments

Popular posts from this blog

విరసం నేత వరవరరావును నానావతి ఆసుపత్రికి తరలింపు..

జైలులో వరవరరావుకు కరోనా పాజిటివ్‌..!

ఇంటి నుంచి బయటకు వస్తే ఇక మాస్కు తప్పనిసరి..!