విరసం నేత వరవరరావును నానావతి ఆసుపత్రికి తరలింపు..

తెలంగాణ: విరసం నేత వరవరరావుకు కోవిడ్ పాజిటివ్ వచ్చిందనే విషయం తెలిసిందే. అయితే ఆయనను ఇప్పడు మెరుగైన చికిత్స కోసం నానావతి హాస్పిటల్ కు మార్చడం జరిగింది. 81 వయసులో వున్న వరవరరావు ఆరోగ్యం క్షీణించినందున బెయిల్ కోరుతూ సోమవారం బొంబాయి హైకోర్టును ఆశ్రయించారు. అనారోగ్యానికి గురైన అతన్ని సోమవారం జెజె హాస్పిటల్ న్యూరాలజీ విభాగానికి తరలించారు. ఆ తర్వాత కోవిడ్ -19 కు పాజిటివ్అని తేలింది.

varavara-rao-who-tested-covid-positive-moved-to-mumbais-nanavati-hospital

వరవరరావు ఆరోగ్యం మీద చాలామంది ప్రముఖులు స్పందిస్తూ అతన్ని విడిచిపెట్టాలని కేంద్రాన్ని కోరారు. మాజీ కేంద్ర మంత్రి చిదంబరం వరవరరావును వెంటనే విడదల చేయాలనీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాయకులు కూడా వరవరరావు ఆరోగ్య దృష్ట్యా ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై ఆంధ్రప్రదేశ్ వైసీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడుకు లేఖ రాశారు. దయచేసి విడుదల చేయాలని కోరారు, 46 ఏళ్ళ క్రితం ఎమర్జెన్సీ సమయంలో, మీరు, నేను, వరవరరావు సహచరులమని గుర్తుచేశారు.

అతడి ఆరోగ్య పరిస్థితిని గమనిస్తున్న వైద్యులు, ఆరోగ్యం స్థిరంగా ఉన్నట్లు పేర్కొన్నారు, కానీ అతనికి న్యూరోలాజికల్ లక్షణాలు ఉన్నాయని గమనించారు. అయితే న్యూరోలాజికల్ మరియు యూరాలజికల్ చికిత్స అవసరం కాబట్టి, ఆదివారం తెల్లవారుజామున అతన్ని ప్రైవేట్ నానావతి ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు.

Comments

Popular posts from this blog

జైలులో వరవరరావుకు కరోనా పాజిటివ్‌..!

ఇంటి నుంచి బయటకు వస్తే ఇక మాస్కు తప్పనిసరి..!