ఈ ఏడాది క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్స్ లేనట్లేనా?

కరోనా మహమ్మారి దెబ్బకు దాదాపుగా అన్ని ఆర్థిక వ్యవస్థలన్నీ కుదేలయ్యాయి. కంప్యూటర్, సాఫ్ట్‌వేర్ కంపెనీలకు అలాగే ఎలెక్ట్రానిక్ ఉత్పత్రి సంస్థలకు ఇది చావు దెబ్బే అని చెప్పాలి. కొన్ని కంపెనీలు వర్క్ ఫ్రొం హోమ్ పద్దతుల్లో పని చేయుంచుకుంటున్నా అది కొంతవరకే సులువవుతుంది. పైగా మేజర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ చేసే వాళ్ళకి అనుమతి ఉండకపోవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో కొన్ని కంపెనీలైతే వున్న జీతాలు ఇవ్వలేని పరిస్థితి. మరి కొన్ని కంపెనీలు జీతాలను కట్ చేస్తున్నాయి.

no-job-hiring-till-next-year

ఇదిలా ఉంటే అసలు నూతన నియామకాలు జరుగుతాయా అనే ఒక సందేహం కలుగుతుంది. ఈ సందేహాన్ని పటాపంచలు చేసేలా నూతన నియామకాల ప్రక్రియ వచ్చే ఏడాది జనవరి నుంచి ఊపందుకుంటుందని రిక్రూట్‌మెంట్‌ సంస్థలు పేర్కొంటున్నాయి. కరోనా వైరస్‌ వ్యాప్తితో క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్స్ నిలిచిపోయాయని, తిరిగి నియామక ప్రక్రియ వేగవంతం కావడానికి ఆరు నెలల సమయం పడుతుందని కెరీర్‌నెట్ కన్సల్టింగ్ సంస్థ పేర్కొంది. అలాగే కరోనా కారణంగా నియామకాలను నిలిపివేసిన కంపెనీలు కూడా ఆరు నెలల తర్వాత చురుకుగా హైరింగ్‌ చేపడతామని పేర్కొంది.

ఇటీవల జరిపిన ఒక సర్వేలో పాల్గొన్న ఐటీ కంపెనీల్లో 43 శాతం కంపెనీలు వచ్చే ఏడాది జనవరిలో నియామకాలకు వెళతామని వెల్లడించాయని కెరీర్ నెట్ కన్సల్టింగ్  సంస్థ పేర్కొంది. 2021 ఏప్రిల్‌ నాటికి పరిస్థితి మారుతుందని కెరీర్‌నెట్‌ సహవ్యవస్ధాపకులు అన్షుమన్‌ దాస్‌ అంచనా వేశారు.

అయితే ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా క్యాంపస్‌ నియామకాలు కొంతమేర తగ్గే అవకాశాలున్నాయని వెల్లడైంది. ఈ ఏడాది క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్‌కు వెళ్లే ఆలోచనలేదని 27 శాతం కంపెనీలు పేర్కొనగా, 39 శాతం కంపెనీలు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపాయి.

ఏదేమైనా కరోనా తీవ్రత తగ్గితేగాని భవిష్యత్తులో నియామకాలపై ఒక ఆలోచనకు కంపెనీలు రాలేవని అర్ధమౌతుంది. (తెలంగాణ ఇంటర్ సిలబస్ 30% కుదింపు!)

Comments

Popular posts from this blog

విరసం నేత వరవరరావును నానావతి ఆసుపత్రికి తరలింపు..

జైలులో వరవరరావుకు కరోనా పాజిటివ్‌..!

ఇంటి నుంచి బయటకు వస్తే ఇక మాస్కు తప్పనిసరి..!