ప‌వ‌ర్ స్టార్ మూవీ: ఎన్నిక‌ల త‌ర్వాత జరిగిన క‌థ అంటున్న ఆర్జీవీ

ప‌వ‌ర్ స్టార్ మూవీ: రామ్ గోపాల్ వ‌ర్మ తన సినిమాల ద్వారా ఎప్పుడూ వార్త‌ల్లో నిలుస్తూంటారు. అందులోనూ ఈ మ‌ధ్య ఎక్కువగా కాంట్ర‌వ‌ర్సీలను ఎదుర్కొంటున్నారు వర్మ. ఈ మ‌ధ్య రిలీజ్ అయిన క్లైమాక్స్, నగ్నం సినిమాల ద్వారా కొన్ని కాంట్రవర్సీలు ఎదుర్కొన్న వర్మ ఇప్పుడు తాజాగా అమృత‌-ప్ర‌ణ‌య్‌ల ల‌వ్ స్టోరీ మీద ‘మ‌ర్డ‌ర్’ అనే సినిమా తీస్తున్నట్టు ప్రకటించి వివాదంలో కాలు మోపారు.

rgv-power-star-movie-first-look

ఇదిలా ఉంటే ఆయ‌న ప్ర‌క‌టించిన ‘ప‌వ‌ర్ స్టార్’ సినిమా నుంచి ఓ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు. పోస్ట‌ర్‌లో 'ఎన్నిక‌ల త‌ర్వాత జరిగిన క‌థ' అంటూ లీక్ ఇచ్చి సినిమాలో ఏం వుండబోతుందో చెప్పగానే చెప్పారు. అంతేకాకుండా పోస్ట‌ర్‌లోని టైటిల్ లోగోలో ఒక టీ గ్లాస్’ కూడా ఉంది. అలాగే మ‌రో పోస్ట‌ర్ రిలీజ్ చేసిన వ‌ర్మ‌ అందులో మెగాస్టార్ చిరంజీవి, ప‌వ‌న్ తో కూర్చిని వున్న ఫోటో వుంది. ప‌వ‌ర్ స్టార్ సినిమాలో ఈ ఇద్ద‌రు బ్ర‌ద‌ర్స్ కూడా ఓ స‌న్ని వేశంలో ఉంటార‌ని ట్వీట్ చేశాడు వ‌ర్మ‌. దీంతో అస‌లు ఈ సినిమాలో వ‌ర్మ ఏం చూపించ‌నున్నాడో అని ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు సినీ అభిమానులు. ఇవ‌న్నీ చూస్తుంటే వ‌ర్మ మ‌రోసారి వివాదాల్లోకి రాబోతున్నాడ‌ని అర్థ‌మ‌వుతోంది.

లాక్ డౌన్ కార‌ణంగా అన్ని సినిమా హాళ్లు బంద్ అయిన సంగ‌తి తెలిసిందే. దీంతో వ‌ర్మ‌ ఆర్ జి వి వ‌ర‌ల్డ్ థియేట‌ర్ అనే యాప్‌ లో త‌న సినిమాల‌ను విడుద‌ల చేస్తున్నారు. ఇందులో సినిమా చూడాలంటే టిక్కెట్ రేటు 150 నుంచి 200 వుంది.

Comments

Popular posts from this blog

విరసం నేత వరవరరావును నానావతి ఆసుపత్రికి తరలింపు..

జైలులో వరవరరావుకు కరోనా పాజిటివ్‌..!

ఇంటి నుంచి బయటకు వస్తే ఇక మాస్కు తప్పనిసరి..!