Posts

Showing posts from September, 2021

Movies on Social Disorder and Social Issues

Movies on Social Disorder and Social Issues: ఈ మధ్య మన దగ్గర సామాజిక రుగ్మతల్ని చర్చించే కధలతోటి సినిమాలు వస్తున్నాయి. (పలాస, ఉప్పెన, అసురన్, విశారనై, కర్ణన్, పరియేరుమ్ పెరుమాళ్, నాయట్టు, పింక్...  ఇంకా చాలా చిత్రాలు). అవి ఎంత వరకూ విజయవంతం అవుతున్నాయి, ఎంతవరకూ ప్రభావవంతంగా ఉన్నాయి అన్నది ప్రస్తుతానికి పక్కన పెడితే ఈ చిత్రాలు అన్నీ మన సమాజంలో ఉన్న వివిధ వివక్షల పైన వాటి వాటి వ్యాఖ్యనాలు చేస్తున్నాయి. ఐతే ఈ కధలు చోటు చేసుకునే స్థల కాలాల్ని, అక్కడి సంస్కృతినీ నిజ జీవితానికి దగ్గరగా చూపించాలి అన్న ప్రయత్నం (వేరు వేరు మోతాదు ల్లో) ఈ చిత్రాల్లో మనకు కనబడుతుంది. ఇక్కడే ఒక ఆసక్తికరమైన ప్రశ్న. సామాజిక అంశాల్ని, నిజ జీవిత కథల్నీ చర్చించేప్పుడు ఈ realism ఉండాల్సిందేనా? నేను casual గా సంభాషించిన చాలా మంది మిత్రులు అవుననే అన్నారు. ఆ కథ యొక్క "సెట్టింగ్" ని ఎంత దగ్గరగా ప్రతిబింబిస్తే చిత్రం తీసుకున్న అంశం, దాని సందేశం అంత బలంగా వినబడే అవకాశం ఉందనీ, వేరే metaphor లను విశదీకరించే బదులు విషయాన్ని నేరుగా చర్చించడం వల్ల అన్ని కోణాల్నీ స్పృశించవచ్చు అన్నది వాళ్ళ అభిప్రాయం. ఆ చర్చ తర్వాత ఎందుకో