Movies on Social Disorder and Social Issues

Movies on Social Disorder and Social Issues:

ఈ మధ్య మన దగ్గర సామాజిక రుగ్మతల్ని చర్చించే కధలతోటి సినిమాలు వస్తున్నాయి. (పలాస, ఉప్పెన, అసురన్, విశారనై, కర్ణన్, పరియేరుమ్ పెరుమాళ్, నాయట్టు, పింక్...  ఇంకా చాలా చిత్రాలు). అవి ఎంత వరకూ విజయవంతం అవుతున్నాయి, ఎంతవరకూ ప్రభావవంతంగా ఉన్నాయి అన్నది ప్రస్తుతానికి పక్కన పెడితే ఈ చిత్రాలు అన్నీ మన సమాజంలో ఉన్న వివిధ వివక్షల పైన వాటి వాటి వ్యాఖ్యనాలు చేస్తున్నాయి. ఐతే ఈ కధలు చోటు చేసుకునే స్థల కాలాల్ని, అక్కడి సంస్కృతినీ నిజ జీవితానికి దగ్గరగా చూపించాలి అన్న ప్రయత్నం (వేరు వేరు మోతాదు ల్లో) ఈ చిత్రాల్లో మనకు కనబడుతుంది. ఇక్కడే ఒక ఆసక్తికరమైన ప్రశ్న. సామాజిక అంశాల్ని, నిజ జీవిత కథల్నీ చర్చించేప్పుడు ఈ realism ఉండాల్సిందేనా? నేను casual గా సంభాషించిన చాలా మంది మిత్రులు అవుననే అన్నారు. ఆ కథ యొక్క "సెట్టింగ్" ని ఎంత దగ్గరగా ప్రతిబింబిస్తే చిత్రం తీసుకున్న అంశం, దాని సందేశం అంత బలంగా వినబడే అవకాశం ఉందనీ, వేరే metaphor లను విశదీకరించే బదులు విషయాన్ని నేరుగా చర్చించడం వల్ల అన్ని కోణాల్నీ స్పృశించవచ్చు అన్నది వాళ్ళ అభిప్రాయం. ఆ చర్చ తర్వాత ఎందుకో వెంటనే కొన్ని హాలీవుడ్ సినిమాలు గుర్తొచ్చాయి.

Read: Telugu Movie Auditions in Hyderabad

జేమ్స్ కామెరన్ దర్శకత్వంలో వచ్చిన Aliens (Alien కి సీక్వెల్) లో భూమికి దూరంగా వేరే గ్రహం మీదెక్కడో ఉన్న aliens ని వేటాడటానికి ఒక బృందం వెళ్తుంది. చాలా futuristic టెక్నాలజీ తో చేయబడ్డ ఎయిర్క్రాఫ్ట్స్, మిలిటరీ గేర్ తో పలు రకాల యుద్ధవిద్యల్లో శిక్షితులైన టీం అక్కడ దిగుతారు. ఐతే ఆ aliens వాటి స్థావరంగా ఏర్పర్చుకున్న బిల్డింగ్ fusion powered అవ్వడం వల్ల అక్కడ గన్స్ ఉపయోగించాకూడదు అని వాళ్లకు అక్కడికి వెళ్లే వరకూ తెలీదు. ఇక చూస్కో... డజన్ల కొద్దీ alien లు మీదకి వచ్చేస్తుంటే కేవలం blowtorch లు మాత్రమే ఉపయోగించాల్సిన పరిస్థితి. టీం లో చాలా మంది వాటికి బలైపోతారు. వాళ్ళ టెక్నాలజీ, నైపుణ్యం, ఆయుధాలు ఏవీ అక్కడ పనికిరాకుండా పోతాయి. అవే్మీ లేని aliens కేవలం వాటి సహజసిద్ధమైన survival instincts తో, hunting skills తో ఈ sophisticated మనుషుల్ని దాదాపు తుడిచిపెట్టేస్తాయి. ఈ adventure సినిమా చూస్తున్నంత సేపూ తరువాత ఏం జరుగుతుందో అన్న ఉత్కంఠ చివరి వరకూ మనల్ని వదలదు. ప్రమాధాకరమైన గ్రహాంతర వాసులు, ఒళ్ళు గగుర్పొడిచే పోరాటాలు, సైన్స్ ఫిక్షన్ కథ మధ్యలో సాహసోపేత విన్యాసాలు ఉన్న ఈ popcorn సినిమా నిజానికి అమెరికా తన చరిత్రలో ఎప్పటికీ మర్చిపోలేని vietnam యుద్ధం నుండి ప్రేరణ పొందిందట. Vietnam యుద్ధం లో అమెరికా కి ఇలాంటి అనుభవమే ఎదురయ్యింది. ఆ దేశాన్ని చాలా తక్కువ అంచనా వేసిన అమెరికా సైనిక దళాలు అక్కడి గెరిల్లా వార్ఫేర్ ఎత్తుగడలకు చిత్తు చిత్తు గా ఓడిపోయారు. ఈ ఓటమి అమెరికా ప్రైడ్ మీద ఒక చెరిగిపోని మచ్చ ఇప్పటికీ. Aliens చిత్రం వెనుక ఈ యుద్ధ అనుభవం తాలూకు పీడకలలు స్ఫూర్తి అని ఆ దర్శకుడే చెప్పాడు. ఇలా చారిత్రక విషయాన్ని హారర్ లాంటి చాలా పవర్ఫుల్ జానర్ సినిమా వెనుక నుండి refer చేయడం వల్ల ఆ ఈవెంట్ యొక్క psychological power ని దాని పూర్తి dramatic intensity తో పట్టుకునే వీలు కుదురుతుంది. అంటే ఒక చారిత్రక సంఘటనని దాని నిజ జీవిత realism తో కాకుండా దాని exaggerated dramatic form లో ప్రస్తావించేప్పుడు రియాలిటీ ని దాటుకుని ఆ సంఘటన ప్రేరేపించే subconscious భయాలను నేరుగా చూపించే వీలు కుదురుతుంది.

Read: List of New Telugu Movies on OTT Platform

ఇందాక అన్నట్టు ఒక నిజ జీవిత విషయాన్ని తెర మీదకి తేవడానికి realism ఒక్కటే దారి కాదు. ఒక పక్కా జానర్ సినిమాలో కూడా అందుకు అవకాశం ఉంటుంది. The Dark Knight సినిమాలో జోకర్ Gotham నగరాన్ని వణికించే సన్నివేశాల్లో అమెరికా యొక్క 9/11 భయాలు వ్యక్తమవుతాయి. (జోకర్ కూడ లో క్వాలిటీ వీడియోల్లో మనుషుల్ని చంపి బెదిరింపులు చేస్తుంటాడు, అమాయకుల్ని అడ్డు పెట్టుకుని డిమాండ్స్ చేస్తుంటాడు, ఆత్మహుతి చేసుకుంటానని బెదిరించడానికి grenade ని జేబులో పెట్టుకుంటాడు). అమెరికన్లకు ఒక పట్టాన అర్ధం కాని, పొసగని anarchy ని సమాజం మీదకి ఒదులుతాడు జోకర్. అప్పటి వరకూ తమ first world privilege లో సేద దీరుతున్న వరల్డ్ ట్రేడ్ సెంటర్ సంఘటన తర్వాత అసలు అలాంటి పని ఎవరైనా ఎందుకు చేస్తారో అని అటువంటి విషయాల గురించి అర్ధం చేసుకోడానికి ఎంతో ఆలోచన వెచ్చించి అలసిపోయిన అమెరికన్ సామూహిక అంతరంగం ఈ టెర్రరిస్ట్ పాత్రలలోంచి మనకు కనబడుతుంది.

జపాన్ మీద అమెరికా చేసిన అణు దాడి ఆ దేశం ఎప్పటికీ మర్చిపోలేదు. జపాన్ లో తయారయ్యిందే ఈ Godzilla పాత్ర. Godzilla ఒక nuclear monster. ఇప్పటి సినిమాల్లో అంటే అది మానవాళికి మంచి చేసే మృగంలా చూపిస్తున్నారు కానీ మొదట్లో అది ఒక విధ్వంసకర మహా శత్రువు. జపాన్ దేశపు సామూహిక న్యూక్లియర్ భయాలకు ప్రతీక ఈ monster. ఇక అటువైపు చాలా అమెరికన్ superhero సినిమాల్లో విలన్ పాత్రలు పర్యావరణం మీద ఉన్న ముప్పు చెప్పడానికో, టెక్నాలజీ వల్ల ప్రమాదం గురించి హెచ్చరించడానికో అన్నట్టు రాస్తుంటారు. ఆయా దేశాల సంస్కృతి, చారిత్రా అక్కడి popcorn సినిమాల్ని ప్రభావితం చేస్తుంటాయి అనవచ్చేమో. మరీ ఇంత indirect గా కాకుండా allegory లా సామాజిక అంశాల్ని చెప్పే సినిమాలు కూడా అక్కడ ఉన్నాయి. వెస్ట్రన్ సమాజంలో ప్రమాదకర స్థాయిలో ఉండే racism, xenophobia ని District 9 లాంటి సినిమాలు బాహాటంగానే ప్రకటిస్తాయి. ఇది కూడా aliens కధే. ఐతే ఇక్కడ aliens ఎవరికీ హాని తలపెట్టవు. భూమి మీద మనుషులతో పాటే ఉండాల్సిన పరిస్థితి వాటికి వస్తే ఆ చుట్టూ మనుషులు ఎలా స్పందించారు అన్నదే ఈ చిత్ర కథ. నల్ల జాతీయుల పట్లా, ముస్లిమ్స్ పట్లా racist వైఖరిని చూపించే వెస్ట్రన్ సమాజంపై ఒక కామెంటరీ లా ఉంటుందీ చిత్రం.

ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో వందల ఉదాహరణలు. సామాజిక అంశాల మీద వ్యాఖ్యానం చేయాలంటే అన్నీ డ్రామా జానర్ సినిమాలే అవసరం లేదు. దర్శక రచయితలకి అవగాహన ఉండాలే కానీ ఎక్కువగా మన senses కే appeal అయ్యే కమర్షియల్ సినిమాల్లో కూడ నేరుగా సందేశాత్మకంగా అనిపించి బోర్ కొట్టించకుండా జానర్ థ్రిల్స్ ని చక్కగా లేయర్ చేయవచ్చు. అంటే మన తెలుగు మసాలా సినిమాల్లో కూడ లంచగొండితనం మీదా, ఆసిడ్ దాడుల మీదా విరుచుకుపడే "hero"లు ఉన్నారు కానీ నేను అంటుంది ఆ పేలవమైన ఉపన్యాసాల గురించి కాదు. సమస్యను నేరుగా కాకుండా దాని dramatic symbolism వెనుక దాచి పైకి కేవలం ఒక popcorn సినిమా అనిపిస్తూనే మన లోలోపలి భయాల్ని ఆలోచనల్ని స్పృశించగల సినిమాలు చేయవచ్చు. అలాంటప్పుడు మనోభావాలు అంటూ చించుకునే వాళ్ళను కూడ తప్పించుకోవచ్చు. Lol.  ఐతే అన్ని కధలూ ఇలా చెప్పలేము. పైన చెప్పిన realism తో మాత్రమే చెప్పాల్సిన కధలు కొన్ని, ఇలా జానర్ ఎలిమెంట్స్ కి లొంగే కధలు కొన్నీ. ఈ వ్యాసం ముగించే సమయానికి ఇంకా అనేక ఉదాహరణలు, ఆ సినిమాల వెనుక వెనుక ఆసక్తికర విశేషాలు గుర్తొస్తున్నాయి కానీ ప్రస్తుతానికి ఇక్కడ ముగిద్దాం. వీలైతే మరోసారి.

Read: Love Story Movie Download Movierulz

By Swaroop

Comments

Popular posts from this blog

విరసం నేత వరవరరావును నానావతి ఆసుపత్రికి తరలింపు..

జైలులో వరవరరావుకు కరోనా పాజిటివ్‌..!

ఇంటి నుంచి బయటకు వస్తే ఇక మాస్కు తప్పనిసరి..!